ఏపీలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందని టీడీపీ అగ్రనేత లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో లోకేశ్ సమావేశం అయ్యారు జగన్ పాలనలో అన్ని రంగాల నిపుణులు బాధితులేనని అసహనం వ్యక్తం చేశారు. ఎకనామిక్ యాక్టివిటీని పూర్తిగా నిలిపేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేశారని విమర్శించారు.