పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 12,710 మంది ఒప్పంద ఉపాధ్యాయులను రెగ్యులరైజే చేసింది. అలాగే, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ త్వరలోనే బస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద 20 వేల మంది విద్యార్థులకు ఈ సర్వీసును అమలు చేస్తామని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో తమ విద్యను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ పథకం తెచ్చామన్నారు.