రామతీర్థం రిజర్వాయర్‌కు సాగర్ జలాలు చేరుకున్నాయి. 959 క్యూసెక్కుల మేర జలాశయంలోకి ఓబీసీ ద్వారా వస్తున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 85.34 మీటర్లు కాగా ప్రస్తుతం 79.06 మీటర్ల మేర ఉంది. ఇదేవిధంగా మరో వారంరోజులు ఇన్‌ఫ్లో కొనసాగితే జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుంది. ప్రస్తుతం దిగువకు నీటి సరఫరాను నిలిపివేశారు. జలాశయం నిండిన తర్వాత దిగువకు తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేయనున్నారు.