మణిపూర్ ఘటన పై కడప జిల్లా, బహుజన సమాజ్ పార్టీ తంబళ్ళపల్లె నియోజకవర్గ ఇనచార్జి సిద్ధగాళ్ళ ప్రసాద్ ఆధ్వ ర్యంలో శుక్రవారం రాస్తా రోకో నిర్వహించారు. ములకలచెరువు బస్టాండు సర్కిల్లోని ముంబై - చెన్నై జాతీయ రహదారిలో సీపీఐ, క్రిస్టియన మత పెద్దలతో కలిసి బీఎస్పీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మణిపూర్లో మతం పేరుతో చేస్తున్న విధ్వంసాలను ఆపాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజే శారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి అంజనప్ప, పట్టణ కార్యదర్శి ఆనంద్, ఫాస్టర్ నాగేంద్రుడు, నాయకులు రమణ, నరసింహు లు, షపీ తదితరులు పాల్గొన్నారు.