హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలో అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ మణిపూర్ లో జరుగుతున్న అకృత్యాలకు ప్రధానమంత్రి బిజెపి ప్రభుత్వమే కారణమని, మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్న బిజెపి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని దీని పూర్తి బాధ్యత నరేంద్ర మోడీదేనన్నారు.