మడకశిర మండలం మత్తుపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తిప్పేస్వామి హాజరై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వాలంటరీ ద్వారా అందిస్తున్నారు అన్నారు. సమస్యలో ఉండి సంక్షేమ పథకాలు అందిన వారికి జగనన్న సురక్ష భాగంగా సమస్య పరిష్కరించి పథకాలు అందజేస్తామని తెలిపారు.