ధర్మవరం నియోజకవర్గంలోని పోతుకుంట కాలనీని శనివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలలో పేదలకు ఇచ్చిన గృహాలు వంకల్లోనూ వాగులలోను పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారని అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కాలనీలను తప్పకుండా అభివృద్ధి చేస్తామని మధుసూదన రెడ్డి పేర్కొన్నాడు.