పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిలో నిద్రిస్తున్న సుమారు 85 సంవత్సరాల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకెళ్లి అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. శనివారం వృద్ధురాలు కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదనందిపాడు ఎస్సై అబ్దుల్ రెహమాన్ మీడియాకు తెలిపారు.