గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పిడుగురాళ్ల, రేపల్లె, దొనకొండ స్టేషన్ల అభివృద్ధిపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్నట్లు రైల్వే అధికారి శనివారం తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వీటిని ఆధునికీకరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అందువల్ల ఎటువంటి పనులు అక్కడ చేస్తే ప్రయాణికులకు గరిష్ఠంగా మేలు జరుగుతుందో ఆగస్టు 3లోపు తెలియజేయాల్సిందిగా కోరారు. pgr12.gnt@gmail.com ద్వారా సూచనలు ఇవ్వాలన్నారు.