భీమిలి నియోజకవర్గంలోని రైతులకు వరి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ భీమిలి సబ్ డివిజన్ ఏడి విజయ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమిలి లో 1761ఎకరాలు, ఆనందపురం లో 1852 ఎకరాలు, పద్మనాభంలో 7481ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు వరి సాగు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మూడు మండలాల్లో 590 ఎకరాల్లో నారుమళ్లు వేశారన్నారు.