విశాఖ పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డులో రోడ్ల అభివృద్ది పనులు చురుగ్గా సాగుతున్నాయి. శాంతీనగర్ పార్క్ పరిసర ప్రాంతాలలో బీటి రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ మేరకు శనివారం నగర డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలసి పర్యవేక్షించారు. 19 లక్షల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని శ్రీధర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa