రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి వైసీపీ ప్రభుత్వం ప్రోటోకాల్‌కు భంగం కలిగిస్తోందని ఆమె భర్త, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ సిటీలో జరిగే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇలా ఏ కార్యక్రమైనా ముందు రోజు రాత్రి ఫోన్‌చేసి చెప్పడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ వెళ్తే ఆమెపై విమర్శలు చేయడం సరికాదన్నారు.