అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్ చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పీలేరు ఎస్ఈబి సిఐ వై. గురుప్రసాద్ తెలిపారు. శనివారం పీలేరు మండలం, పొంతలచెరువు క్రాసులో దాడులు చేసి, అనుమతి లేకుండా 12 టన్నుల ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్ చేసి, ఒక్కో ట్రాక్టర్ కు రూ. 10 వేలు చొప్పున అపరాధం విధించామన్నారు. దాడుల్లో తనతో పాటు ఎస్ఐ లక్ష్మీనరసయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa