ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన పాకిస్తాన్ అబ్బాయిని కలిసేందుకు 16 ఏళ్ల బాలిక ప్రయత్నించింది. విమానంలో లాహోర్ వెళ్లేందుకు రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా అధికారులు బాలికను అడ్డుకున్నారు. ఆమె దగ్గర సరైన పత్రాలు లేకుండా లాహోర్ వెళ్లేందుకు టిక్కెట్టు అడిగింది. దాంతో అమ్మాయిని విచారించగా అసలు విషయం చెప్పంది. తన పేరు గజల్ మహ్మద్ అని, పాకిస్తాన్ పౌరురాలినని చెప్పింది. బంధువుల ఇంటికి భారత్కు వచ్చానని, ఇక్కడ పెళ్లికి బలవంతం చేస్తున్నారని ఆరోపించింది.