దేశరాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఇన్స్పెక్టర్ జగ్బీర్ సింగ్ మృతి చెందాడు. మెకానికల్ సమస్యతో మాదీపూర్ మెట్రో స్టేషన్ వద్ద కారు ఆగింది. ఇన్స్పెక్టర్ కారు బయట నిల్చొని ఉండగా, ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఇన్స్పెక్టర్ కు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.