తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమవారం ఉదయం 11. 30 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. జశ్వంతరావు శనివారం తెలిపారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్ అధ్యక్షతన వహిస్తారన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు పాల్గొనాలని కోరారు.