నరసరావుపేటలోని బరంపేటకు చెందిన చిన్నలూరి సాంబశివరావు (25) మద్యం మత్తులో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం. మృతుడు ఓ వైద్యశాలలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం తాగి ఇంటికి వెళ్ళగా అతని భార్య పిల్లలను పాఠశాలలకు పంపించే విషయంలో ప్రశ్నించింది. మత్తులో ఆవేశానికి లోనై ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. తండ్రి సీతారామయ్య ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.