పొలంలో గడ్డి కోస్తూ పాము కాటుకు గురై ఓ వివాహిత మృతి చెందిన సంఘటన వినుకొండ మండలం కనమర్లపూడి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతిరావు కథనం మేరకు గ్రామానికి చెందిన వినుకొండ జ్యోతి (45) పొలంలో గడ్డి కోస్తుండగా పాముకాటుకు గురైనట్లు గమనించింది. ఇంటికి వచ్చి తన భర్త రాంబాబుకు విషయం చెప్పగా వెంటనే వినుకొండ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు.