ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ జైపూర్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో నగరంలోని పలు రహదారులపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. జైపూర్లోని టోంక్ రోడ్, బీ2 బైపాస్, జవహర్ నగర్, విద్యాధర్ నగర్ జలమయమయ్యాయి. రాజస్థాన్లోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అజ్మీర్, జై సల్మేర్, బికనీర్, కోటా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.