తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగస్టు 2వ తేదీన వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును సందర్శించి, ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం పులివెందులకు వెళ్లనున్నారు. కాగా, పెన్నా టు వంశధార పేరుతో చంద్రబాబు ఆగస్టు 1 నుండి 10వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులను సందర్శిస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa