ముంబై నుండి జైపూర్ వెళ్తున్న జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో కాల్పుల కలకలం రేగింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. రైలు మహారాష్ట్రలోని పాల్గర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ ఏఎస్సైతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. అనంతరం రైలులో నుండి బయటకు దూకేశాడు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.