పాకిస్తాన్‌కు చెందిన ముహమ్మద్ గులాబ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తన ప్రియుడిని కలిసేందుకు సలార్జైకు వచ్చిందని పేర్కొన్నాడు. సిల్లీగా షేర్ చేసిన ఈ పోస్టు సీరియస్‌గా మారిపోయింది. ఈ పోస్టు చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై అడ్రస్‌కు చూశారు. అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ముహమ్మద్ గులాబ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.