కాచిగూడ నుంచి నంద్యాల జిల్లా డోన్ మీదుగా యశ్వంతపూర్‌కు ఆగస్టు 6వ తేదీన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానున్నట్లు గుంతకల్లు డివిజన్ మేనేజర్ జీ.వెంకటేశ్వర్లు తెలిపారు. గుంతకల్లు డివిజన్లో డోన్ రైల్వే స్టేషన్ మొదటిది కావడంతో ఇక్కడి నుంచే ప్రారంభోత్సవాలు జరుగుతాయన్నారు. డోన్ నుంచి కాచిగూడకు సోమవారం వందేభారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.