ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పథకాలు, 11 రకాల ధృవీకరణ పత్రాల జారీలో సమస్యలను తీర్చేందుకు 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత నెల 23న ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 15,002 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తికాగా, 40.52 లక్షల మందికి క్యాస్ట్ సర్టిఫికేట్స్, 38.52 లక్షల మందికి ఇన్ కం సర్టిఫికేట్స్ ను అందించారు. మొత్తంగా 92.97 లక్షల వినతులను పరిష్కరించారు.