అమృత్ భారత్ పథకం కింద రైల్వే శాఖ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనుంది. ఈ నేపథ్యంలో తొలి దశగా విజయవాడ డివిజన్‌లోని మొత్తం 11 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. అనకాపల్లి, భీమవరం టౌన్, కాకినాడ, ఏలూరు, నిడదవోలు, నరసాపురం, ఒంగోలు, తాడేపల్లిగూడెం, సింగరాయకొండ, తుని, తెనాలి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్టేషన్లలో ఎలాంటి అభివృద్ధి జరగాలనే అంశాలపై ప్రయాణికులు ఆగస్టు 3వ తేదీలోగా సూచనలు, సలహాలు ఇవ్వాలని డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు.