చిన్నపిల్లల అక్రమ రవాణాలో ఏపీ దేశంలో మూడో స్థానంలో నిలిచింది. భారత్ చిన్నారుల అక్రమ రవాణా' పేరుతో గేమ్స్ 24X7 అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో చిన్న పిల్లల అక్రమ రవాణాలో తొలి మూడు స్థానాల్లో బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ నిలిచాయి. 2016 నుంచి 2022వరకు బీహార్ లో 4245 కేసులు నమోదవ్వగా, యూపీలో 3836 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 734 నమోదయ్యాయి.