మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. తమకు జరిగిన అవమానంపై బాధిత మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు.