చంద్రబాబు అంత గొప్పనటుడ్ని రాజకీయాల్లో నేను ఇంతవరకు చూడలేదు అని మంత్రి అంబటి ఎద్దేవా చేసారు. అయన మాట్లాడుతూ..... సినిమాల్లో ఎన్టీ రామారావును అద్భుతమైన నటుడిగా చూశాం కానీ.. రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు తర్వాతనే ఎవరైనా అన్న విషయం నిన్ననే తెలిసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. పచ్చి అబద్ధాలు మాట్లాడి.. నవరసాలు పండించి ఔరా.. అనే విధంగా నటించాడు. ఈ నటనకు బాబుకు ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పు లేదు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు పీడ.. రాష్ట్రానికి ఒక శని చంద్రబాబు. ఎందుకంటే, పోలవరం పనులు ఒక్క అడుగు కూడా ముందుకెళ్లకుండా కోర్టులకెళతాడు. విమర్శలు చేస్తాడు. బట్ట కాల్చి మీదేసినట్లు ఆరోపణలు చెయ్యడంలో సిద్ధహస్తుడు అని అన్నారు.