తెనాలి పట్టణ పరిధిలోని గంగానమ్మపేటలో తాళం వేసిన ఇంట్లో చోరీ ఘటనపై కేసు నమోదు అయింది. నివాసితులు ఈనెల 26న వైద్య అవసరాల నిమిత్తం విజయవాడ వెళ్లి ఈనెల 29న ఇంటికి తిరిగి వచ్చి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. మొత్తం ఎనిమిది సవర్ణ బంగారు నగలు చోరీకి గురయ్యాయని రెండో పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.