ఫ్రాన్స్‌కు చెందిన రెమీ లుసిడి (30) తాజాగా ఓ భవనాన్ని అధిరోహించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం ది ట్రెంగటెర్ టవర్ కాంప్లెక్స్ భవనాన్ని ఎక్కేందుకు ప్రయత్నించాడు. సెక్యూరిటీ గార్డును బురిడీ కొట్టించి ఎలివేటర్ సాయంతో పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. 68వ ఫ్లోర్‌లోని పెంట్ హౌస్ కిటికీ బయట చిక్కుకుపోయాడు. కిటికీని బలంగా తన్నే క్రమంలో పట్టు కోల్పోయి కిందకు జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు.