మాజీ మంత్రి నారాయణ సోదరుడు పొంగూరు సుబ్రహ్మణ్యం భార్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు చెయ్యడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.... నా భార్య పొంగూరు ప్రియా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నది. మానసిక ఒత్తిడితోనే ఏవేవో వీడియోలు చేస్తోంది. మానసిక అనారోగ్యానికి గురైన వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆమె మా కుటుంబంపై మాట్లాడిన వీడియోలను ఎవ్వరూ పట్టించుకోవద్దు అని తెలియజేసారు.