జనసేన నేతలు సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ పై విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.... ఈయన భారత్ లోనే అత్యంత ఖతర్నాక్ ముఖ్యమంత్రి. చూడడానికి అమాయకంగా కనిపిస్తారు కానీ ఎంతో చురుకైన మనిషి. 2019లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రెండవ రకమైన ఖతర్నాక్ వ్యక్తి. ఎందుకంటే వీరి తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావాల్సినంత ధనం సంపాదించారు. ఆ మొత్తం రూ. 510 కోట్లకు పైమాటే. నేటి లెక్కల ప్రకారం భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల్లో ఈయనదే మొదటి స్థానం. అంతకంటే ముఖ్యమైన ఖతర్నాక్ విషయం ఏమిటంటే భారత్ లో అతిపెద్ద గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పై 36 క్రిమినల్ కేసులు ఏమీ నడుస్తున్నాయో... ఈ ముఖ్యమంత్రి గారిపై 35 క్రిమినల్ కేసులు, 3 సివిల్ కేసులు కలిపి మొత్తం 38 కేసులు అలాగే నడుస్తున్నాయి. ఇక చెప్పండి సీఎం జగన్ ఖతర్నాక్ అవునా కదా ? అంటూ ఒక వీడియో ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసారు.