లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ సర్వే ఆసక్తికర అంచనాలను వెలువరించింది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 543 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీయే 318 సీట్లను గెలుచుకుంటుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 175 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. ఇతర ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు 50 స్థానాల వరకు గెలుపొందుతారని చెప్పింది.