ఇంజిన్ ఫెయిన్ అవ్వడంతో ఓ పైలెట్ విమానాన్ని సముద్రంలోనే ల్యాండ్ చేశాడు. ఈ ఘటన దక్షిణ ఫ్రాన్స్‌లోని ఫ్రెజుస్ తీరంలో చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తింది. అయితే దగ్గర్లో విమానాశ్రయం లేకపోవడంతో బీచ్‌లో ల్యాండ్ చేయాలని అనుకున్నాడు. కానీ బీచ్‌లో పర్యాటకులు ఉండటంతో పైలెట్ సముద్రంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. అది గమనించిన స్థానికులు రెస్క్యూ టీమ్‌కు చెప్పారు. విమానం ల్యాండ్ చేసిన చోటుకు వెళ్లి పైలెట్‌తోపాటు ఇద్దరు ప్రయాణికులను కాపాడారు.