జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల పరిశీలన పేరుతో పెడన నియోజక వర్గంలో జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెడన పట్టణంలో ఉన్న పెడన పల్లోటి స్కూల్ వెనుక ఉన్న జగనన్న కాలనీలో FailureofJagnannaColony కార్యక్రమం చేసి వస్తుండగా అడ్డుకుని పోలీసులు పైడమ్మ లే అవుట్ జగనన్న కాలనీకి వెళ్ళవద్దు అంటూ నిలువరించి శ్రీ రామ్ సుధీర్, నాయకులను అక్రమ అరెస్టులు చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆ కాలనీ ఎదురుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆఫీస్ ఉన్నందున అటు వెళ్ళరాదు అంటూ ఆంక్షలు విధించారు.