ప్రతిపక్షాల నిరసనలతో ఉభయ సభలు ఇవాళ వాయిదా పడ్డాయి. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. మంగళవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. వెంటనే ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై నిరసనలు తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు.