మయన్మార్ పౌర నేత ఆంగ్‌సాన్ సూకీకి క్షమాభిక్ష లభించింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా అక్కడి సైనిక ప్రభుత్వం ఆమెతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష కల్పించింది. దాంతో ఆంగ్‌సాన్ సూకీ జైలు నుంచి విడుదల కానున్నారు. 2021లో సూకీని సైన్యం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వేర్వేరు కేసుల్లో ఆమెను దోషిగా తేల్చిన సైన్యం నిర్భందంలో ఉంచింది.