సీఎం జగన్ ని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) 2022 – 23 వార్షిక నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత ఉన్నారు.