సీఎం జగన్ పై టీడీపీ నేత బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరంపై జగన్ రెడ్డి అసమర్థత పార్లమెంట్ సాక్షిగా అనేక సార్లు బయటపడిందన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఎప్పటికీ పోలవరం పూర్తి కాదన్నారు. పోలవరాన్ని నాశనం చేసిన సీఎం జగనే అంటూ మండిపడ్డారు. పోలవరంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ అడిగిన సమాచారాన్ని కనీస అవగాహన లేని వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందన్నారు. పోలవరం ముంపు నిర్వాసితులకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేకపోయారన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలు వరదలకు మునిగిపోతే కనీసం వాళ్లకు నిత్యావసర సరుకులను కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని బోండా ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.