జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చేశారు. కేంద్ర కార్యాలయం సిబ్బంది, ఫైల్స్, ఇతర విభాగాలు, కంప్యూటర్లు కూడా మంగళగిరికి తరలించారు. మంగళగిరికి మకాం మార్చిన పవన్.. ఇకపై షూటింగ్ ఉంటేనే హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు అనుగుణంగా పార్టీ వర్గాలు ఇంటిని నిర్మించాయి. సినిమా అంశాలను చర్చించేందుకు కూడా నిర్మాతలు, దర్శకులు మంగళగిరి వస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రమే విజయవాడకు వచ్చారు. సోమ, మంగళవారాల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, మూడో విడత వారాహి యాత్రపై పార్టీ నేతలతో చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది.