ప్రభుత్వం ఈ నెల 2 నుంచి అనగా రేపటి నుండి గర్భిణులకు, బాలింతలకు ఇంటికే పౌష్టికాహారం(టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా వారి వివరాలను ముఖ గుర్తింపు విధానం(ఎఫ్ఆర్ఎస్) యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ యాప్‌పై అవగాహన లేక అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ కార్యాలయానికి వెళ్లి , ఫోన్లలో వివరాల నమోదుకు ఇబ్బందులు పడ్డారు.