స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు చేయాలని ఒంగోలు కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ఆయా శాఖల వారంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షం కురిసినా వేడుకలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. మరో రెండు వారాల సమయం ఉన్నందున ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లు తెలిసేలా శకటాలు, ప్రత్యేక ప్రదర్శన శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.