చిత్తూరు జిల్లాలో బుధవారం వైఎస్సార్ సంపూర్ణ కిట్ల పంపిణీ జరుగుతుందని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సాధికారిత అధికారిణి నాగశైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా గతంలో గర్భిణులు, బాలింతలకు వండి భోజనాలను కేంద్రాల వద్దే పెట్టేవారన్నారు. వాటిలో కొన్ని మార్పులు చేస్తూ ఇప్పుడు ఇళ్ల వద్దకే కిట్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెదటి విడతలో 1-15 రోజుల్లోపల మూడు కిలోల బియ్యం, కిలో పప్పు, అర లీటరు నూనెతో పాటు రెండు కిలోల రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరాలు, 13 కోడిగుడ్లు, రెండున్నర లీటర్ల పాలను అందిస్తారన్నారు. రెండో విడతలో 16-30 రోజుల్లోపల 12 కోడిగుడ్లు, రెండున్నర లీటర్ల పాలను అందజేస్తారన్నారు.