అతిగా మద్యం తాగే వారికే కాకుండా, మితంగా సేవించే వారికి కూడా ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మద్యపానం వల్ల బీపీ పెరిగి, ప్రాణాంతక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కు దారి తీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. రోజుకు ఒక్క పెగ్గు మాత్రమే మద్యం తీసుకునే వాళ్లు అధిక రక్తపోటు బారిన పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా, దక్షిణకొరియా, జపాన్ దేశాల్లో 19 వేల మందిపై అధ్యయనంలో ఇది వెల్లడైనట్లు చెప్పారు.