రూ.2 వేల నోట్లకు సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అప్‌డేట్ ఇచ్చింది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన నుంచి ఇప్పటి వరకు దాదాపు 88 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని వెల్లడించింది. ఆర్‌బీఐ మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పుడు జులై 31 నాటికి దాదాపు రూ.3.14 ట్రిలియన్ రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. ఇంకా రూ.42 వేల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి.