ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందజేస్తున్న ఘనత సీఎంకు దక్కుతుందన్నారు.