దువ్వాడ రైల్వేస్టేషన్లో కొత్తగా రెండు రైళ్లు నిలిపేందుకు రైల్వేబోర్డు ఆమోద ముద్ర వేసింది. మంగళవారం రైల్వే బోర్డు సమావేశంలో విశాఖ- లోకమాన్య తిలక్(ఎల్టీటీ) (18519/20), విశాఖ- హజరత్ నిజాముద్దీన్ స్వర్ణజయంతి (12803/04) ఎక్స్ ప్రెస్‌లకు దువ్వాడలో హాల్టు కల్పించేందుకు నిర్ణయించారు. అయితే కొత్త నిర్ణయంఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో స్పష్టం చేయలేదు.