అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా మూడు పేద కుటుంబాలకు మంగళవారం విశాఖలో సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ కుటుంబాలకు వైద్యం నిమిత్తం ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్ అందజేశారు. పద్మనాభం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన ఏ. తులసి (వాలంటీర్), పెదవాల్తేర్ కు చెందిన కె. రమేష్ (11), వేపగుంటకు చెందిన గులిబి డిల్లీశ్వరరావు (9) కి వైద్యం కోసం సిఎం సాయం చేసి పెద్ద మనసు చాటుకొన్నారు. బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.