రాయలసీమ ద్రోహి చంద్ర బాబు. ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి పట్టిన పెద్ద శని’ అని రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారన్నారు. అలాంటి వ్యక్తి నేడు ప్రాజెక్టుల సందర్శనకు రావడం వింతగా ఉందన్నారు. జిల్లాకు వచ్చే ముందు ఈ ప్రాంతానికి చేసిన మేలు ఏమిటో ఆయన ప్రజలకు చెప్పి రావాల్సింది అన్నారు.డోన్, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని 68 చెరువులను నీటితో నింపేందుకు పనులు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిది అన్నారు. రూ.వేల కోట్లతో వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేస్తానని గత ఎన్నికల ముందు జీఓ ఇచ్చిన బాబు ఏం చేశారో చెప్పాలన్నారు.