ఒక వ్యక్తి పై ఆరోపణలు చేసే ముందు లోకేష్ కొంచెం అయినా స్టడీ చేసుకుంటే మంచిది అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తెలియజేసారు. అయన మీడియాతో మాట్లాడుతూ... తన కంపెనీలోనే నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారని.. జీతాల రూపంలోనే నెలకు పది కోట్లు ఖర్చు చేస్తానన్నారు. చిల్లర పనులకు పాల్పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. పన్నుల రూపంలోనే వందల కోట్లు ప్రభుత్వాలకు కట్టానన్నారు. “వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నాను. ఎన్నికల అఫిడవిట్లోనే నా ఆస్తులు, కంపెనీల వివరాలు తెలుస్తాయి. నా పై ఇన్ని ఆరోపణలపై పాల్పడిన లోకేష్ ని దర్శి నుంచి పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నాను అని తెలియజేసారు.